సింహాచలంలో గోడ కూలి ఎనిమిది మంది మృతి
విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానంలో జరిగిన చందనోత్సవం భక్తులకు విషాదం మిగిల్చింది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి అక్కడి ఓ సిమెంట్ గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో భక్తులు స్వామివారి నిజరూప దర్శనానికి క్యూలైన్లలో నిలుచుని ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఆరు మృతదేహాలు వెలికి తీశారు. శిథిలాల కింద మరో రెండు మృతదేహాలు ఉన్నట్టు సమాచారం అందుతోంది. మృతులలో పురుషులు, మహిళలు…
