నెల్లూరు మద్యం టెండర్లపై రూప్ కుమార్ యాదవ్ వివరణ
ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతు నెల్లూరు నగరంలో ప్రభుత్వ మద్యం షాపులకు సంబంధించినటువంటి టెండర్లలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నగరంలో సిండికేట్లను తయారుచేసి తన అనుచరులకు తన కార్యకర్తలకు ఇస్తున్నారని సాక్షి మీడియాలో మరియు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన విషయాలు పచ్చి అబద్ధమని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి మీడియా మిత్రులకు మరియు జిల్లా ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేస్తున్నానన్నారు….
