అంతర్వేది తెప్పోత్సవం ఘనంగా నిర్వహణ
సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి పుష్పక వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులు గోవింద నామస్మరణతో మారుమ్రోగగా, తెప్పోత్సవం వైభవంగా సాగింది. రంగు రంగుల బాణసంచా కాల్పులతో ఉత్సవం మరింత ఆకర్షణగా మారింది. తెప్పోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఆర్డీఓలు కె. మాధవి, అఖిల లు పాల్గొన్నారు. మూడు ప్రదక్షణలతో సాగిన తెప్పోత్సవంలో భక్తుల ఉత్సాహం…
