Korangi team emerges as the winner in the DSR Mega Cricket Tournament held in Tallarevu. MLA Datla Subba Raju presented the awards.

తాళ్లరేవులో డీఎస్‌ఆర్ మెగా క్రికెట్ టోర్నీ విజేతగా కోరంగి జట్టు

కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధిలోని సీతారాంపురం గ్రామంలో డీఎస్‌ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను టేకుమూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని, ఆటగాళ్లను అభినందించారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో 36 జట్లు పోటీపడ్డాయి. ఫైనల్ పోటీలో గాడిమొగ, కోరంగి జట్లు పోటీ పడ్డాయి. చివరకు విజేతగా కోరంగి జట్టు నిలవగా, రన్నరప్‌గా గాడిమొగ…

Read More
Minister Anam Rama Narayana Reddy visits Antarvedi temple with family, performs special rituals.

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించిన మంత్రి ఆనం

సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో మంత్రిని ఆలయ రీతిపద్ధతిన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక దర్శనం, విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ, సుదర్శన హోమం నిర్వహించారు. వేద పండితుల ద్వారా వేదాశీర్వాదం అందించారు. ఆలయ ఫౌండర్, చైర్మన్…

Read More
Villagers of Ainapuram staged a protest against illegal soil excavation, demanding immediate action.

అయినాపురంలో అక్రమ మట్టిపోతపై గ్రామస్తుల నిరసన

ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో గత 15 రోజులుగా ట్రాక్టర్ల ద్వారా భారీగా మట్టిని తరలించడం గ్రామస్థుల ఆగ్రహానికి కారణమైంది. సర్పంచ్ మోకా రామారావు ఆధ్వర్యంలో గ్రామస్తులు రోడ్డుపై టెంట్ వేసి నిరసన తెలిపారు. సుమారు 40 ట్రాక్టర్లు రోజూ మట్టిని తరలిస్తుండడంతో రహదారులు దెబ్బతింటున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. తనేలు సమీపంలో అక్రమంగా రొయ్యల చెరువును తవ్వి, అక్కడి మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని గ్రామస్థులు పేర్కొన్నారు. దీంతో రోడ్లపై బురద…

Read More
Lab Technician Day was grandly celebrated in Amalapuram, where doctors praised the invaluable services of lab technicians.

ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు అమలాపురంలో ఘనంగా

ల్యాబ్ టెక్నీషియన్ సేవలు అనితరసాధ్యమైనవని పలువురు వైద్యులు కొనియాడారు. ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు కె.ఎం.ఎల్.ఆర్.టి ఆధ్వర్యంలో అమలాపురం వై.టి నాయుడు స్కానింగ్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్‌ల సేవలను గుర్తించాలంటూ పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఐఎంఈ ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్, సెక్రటరీ డాక్టర్ వై.టి నాయుడు మాట్లాడుతూ, ల్యాబ్ టెక్నీషియన్‌ల ద్వారా అందించబడే రిపోర్ట్ ద్వారానే వైద్యం నిర్ణయించబడుతుందని తెలిపారు. రోగుల వ్యాధిని…

Read More
Dolotsavam was celebrated with devotion at Sri Lakshmi Narasimha Swamy Temple in Antarvedi.

అంతర్వేదిలో డోలా పూర్ణిమ డోలోత్సవం వైభవంగా నిర్వహింపు

సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ పరిధిలో గల నాలుగు కాళ్ల మండపంలో డోలా పూర్ణిమ నాడు డోలోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి మహిమను స్మరిస్తూ ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరిపారు. ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. డోలోత్సవాన్ని గత 50 సంవత్సరాలుగా దూశనపూడి గ్రామానికి చెందిన చేన్ను సాంభశివరావు కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నారు. నరసింహుని కుమారుడు పరమేశుని మూడవ నేత్రంతో భస్మమైన తర్వాత రెండవ రోజున…

Read More
Officials investigated allegations against Mulikipalli Sarpanch and will submit a report to the Amalapuram DPO.

ములికిపల్లి సర్పంచ్‌పై ఆరోపణలపై అధికారుల విచారణ

రాజోలు మండలం ములికిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌పై కొందరు వార్డు మెంబర్లు, స్థానికులు పలు ఆరోపణలు చేస్తూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అభివృద్ధి పనులలో అవకతవకలు, పాలనలో లోపాలు ఉన్నాయని ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం డిపిఒ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. రాజోలు, సఖినేటిపల్లి EOPR & RDలు ఫిర్యాదు దారుల సమక్షంలో 12 ప్రధాన అంశాలపై విచారణ నిర్వహించారు. గ్రామస్థుల నుంచి అభిప్రాయాలను సేకరించి, సర్పంచ్‌ తీరుపై సమగ్ర విశ్లేషణ…

Read More
A YSRCP Formation Day rally was held in Amalapuram, where leaders criticized the government for failing to implement its promises.

అమలాపురంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ ర్యాలీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకలకు జిల్లా వైయస్సార్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. హైస్కూల్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ‘అమ్మ ఒడి’, ‘సూపర్ సిక్స్’ వంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా…

Read More