
64 ఏళ్ల తర్వాత కోటనందూరు ఆసుపత్రి అభివృద్ధి ప్రశ్నార్థకం
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండల ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 64 సంవత్సరాల క్రితం తేనే నుకయ్య ఆసుపత్రి స్థాపించబడింది. రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోటనందూరు పీహెచ్సీ సిబ్బంది, డాక్టర్లు, మరియు సేవా కమిటీ సభ్యులు స్థల దాతల కుటుంబీకులను సన్మానించారు. స్థల దాతల మనవడులు మాట్లాడుతూ తమ తాతగారు స్థలం ఇచ్చినప్పటి నుంచి ఆసుపత్రి అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు….