తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఏఎస్పీ
జిల్లా అదనపు ఎస్పీ రమణమూర్తి తెనాలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకున్న భద్రతా చర్యలను సమీక్షించారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెనాలి చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులతో…
