తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

Officials reviewed polling centers in Tenali ahead of the Krishna-Guntur Graduates’ MLC elections. Arrangements are in place for peaceful voting on the 27th.

కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెనాలి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న, తహశీల్దార్ గోపాలకృష్ణ, త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.

27న జరగనున్న ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లు నిరభ్యంతరంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారుల సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించినట్లు తెలిపారు.

ఎన్నికల సందర్భంగా తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెనాలి డీఎస్పీ బి. జనార్దనరావు ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *