Second National Lok Adalat to be held on May 10 in Chintalapudi. Judge urges public to utilize this chance for case settlements.

చింతలపూడిలో జాతీయ లోక్ అదాలత్‌కు పిలుపు

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం విలేఖరి ఎస్‌ఎం పాషా అందించిన సమాచారం ప్రకారం, చింతలపూడి కోర్టులో మే 10న రెండవ జాతీయ లోక్ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి సి హెచ్. మధుబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివాదాలు న్యాయస్థానంలో కాకుండా పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. చింతలపూడి, టీ నర్సాపురం, లింగపాలెం, కామవరపుకోట మండలాలలో సివిల్, క్రిమినల్, మైంటెనెన్స్, రెవిన్యూ విభాగాల్లో కలిపి…

Read More
Due to storm winds in Nuzvid area, mangoes fell from trees causing major loss to farmers already troubled by low yield this season.

ఈదురు గాలులకు మామిడితోటలు తునాతునక!

నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి, ముసునూరు మండలాల్లో గల పలు గ్రామాల్లో ఈదురు గాలులు భారీ నష్టాన్ని మిగిల్చాయి. మామిడి పంటపై ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తున్న రైతులకు తీరని దెబ్బ తగిలింది. ముసునూరు మండలం కేతరాజుపల్లి, చాట్రాయి మండలంలోని పలు తోటల్లో మామిడికాయలు నేలరాలిపోయాయి. ఇప్పటికే ఈ సీజన్‌లో పంట దిగుబడి తక్కువగా రావడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఆ పరిస్థితుల్లో ప్రకృతి మరోసారి తన ప్రతాపం చూపించింది. తుపాన్లు లేకుండానే వచ్చిన ఈదురు గాలులు మామిడికాయలను తోటల…

Read More
Eluru Collector Ventriselvi advises residents to take precautions against rising heat and sunstroke risks.

ఏలూరు జిల్లాలో పెరుగుతున్న ఎండలు – అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచన

ఏలూరు జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెంట్రిసెల్వి సూచించారు. మంగళవారం ఆయన ప్రజలకు సూచనలు చేస్తూ, వడదెబ్బ ముప్పు పెరుగుతున్న దృష్ట్యా ఎండ తీవ్రత నుండి రక్షణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో ప్రజలు బయటకు వెళ్లేప్పుడు నెత్తిక టోపీ లేదా రుమాలు కట్టుకోవాలని, తేలికపాటి కాటన్ బట్టలు ధరించాలని సూచించారు. అలాగే, మధ్యాహ్నం 12 గంటల నుండి 3…

Read More
MLA Balaraju visited Rajesh, the victim of the Buttayagudem attack, and assured a thorough investigation and action against the culprits.

బుట్టాయిగూడెం దాడి బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలరాజు

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలంలో నిన్న జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. సబ్ డీఏఫ్ వెంకటసుబ్బయ్య చేత మడకం రాజేష్‌పై భౌతిక దాడి జరిగిన విషయం తెలుసుకుని, బాధితుడిని పరామర్శించేందుకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆసుపత్రికి వెళ్లారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌ను చూసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, బుట్టాయిగూడెం మండల జనసేన అధ్యక్షుడు బుచ్చిరాజు కూడా…

Read More
YSRCP's 15th Foundation Day was grandly celebrated in Polavaram, with party leaders and workers participating in large numbers.

పోలవరం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టి. నర్సాపురం మండలం సామంతుపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పార్టీకి అహర్నిశలు సేవలందించిన నాయకులకు ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి సామంతుపూడి సూరిబాబు, వాసిరెడ్డి మధు, సీన్ రాజు, ప్రెసిడెంట్ సునంద తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…

Read More
Tenant farmers demand a new law in Eluru. Farmers' association calls for a protest at the Collectorate on March 17.

కౌలు రైతుల కోసం కొత్త చట్టం తేవాలి.. ఏలూరులో ఆందోళన

ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో కౌలు రైతుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌలు రైతుల రక్షణ కోసం కొత్త చట్టం తీసుకురావాలని, ఈ డిమాండ్ కోసం మార్చి 17న కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలులోకి రాలేదని ఆయన విమర్శించారు. కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు, పథకాలు, బ్యాంకు రాయితీలు అందడం…

Read More
Minister Nadendla Manohar attended Women’s Day in Eluru, announcing free gas for 1 crore women under the Deepam-2 scheme.

ఏలూరులో మహిళా దినోత్సవ వేడుకలు – ఉచిత గ్యాస్ సంకల్పం

ఏలూరులో సీఆర్ఆర్ కాలేజీలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఏపీ పౌర సరఫరాలు, ఆహార శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, మహిళల అభివృద్ధి, భద్రత ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యమని వెల్లడించారు. మహిళలు అత్యవసర సమయంలో 181 టోల్ ఫ్రీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదు. ఏపీలో…

Read More