
బాపట్ల–చీరాలలో వందే భారత్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని డిమాండ్
వందే భారత్ రైళ్లకు బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించే విషయంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల న్యూఢిల్లీకి వెళ్లిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి, వందే భారత్‌కు రెండు స్టేషన్లలో స్టాపింగ్ ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎంపీ కృష్ణప్రసాద్ ఇప్పటివరకు రెండు సార్లు రైల్వే మంత్రిని కలసి ఇదే డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. దీనిపై రైల్వే మంత్రి…