
ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక: పంటలకు అనుకూల వాతావరణం
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది ఉత్తర తమిళనాడు, రాయలసీమ తీర ప్రాంతాలకు విస్తరిస్తూ, దానికి అనుబంధంగా 1.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఇప్పటికే రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. అనంతపురం, కడప, ప్రకాశం, శ్రీ సత్యసాయి, నెల్లూరు,…