రావికమతం వద్ద యువకుడి హత్య, విచారణలో పోలీసులు
విశాఖపట్నం జిల్లాలోని రావికమతం మండలం గర్ణికం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి దారుణ హత్య జరిగింది. మేడివాడకు చెందిన 22ఏళ్ల కొలిపాక పవన్ కుమార్ అఘాయిత్యానికి గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రావికమతం ఎస్ఐ రఘువర్మ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం అనకాపల్లి నుంచి క్లూస్ టీమ్ కూడా వచ్చి ఆధారాలను సేకరిస్తోంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు….
