బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రత్యేక పూజలు నిర్వహించి, రాజ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
తొలుత సాగర సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించిన అనంతరం క్షేత్ర పాలకుని దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదాశీర్వాదం అందుకుని ఆలయ ప్రాంగణంలో ఆలయ నిర్మాణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
బోడే రామచంద్ర యాదవ్ అనంతరం శ్రీ కృష్ణ యాదవ సంఘం నిర్మిస్తున్న శ్రీ కృష్ణాలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా రెండు లక్షల రూపాయల విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. యాదవ సంఘం అభివృద్ధికి తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఎం. వెంకటేశ్వరరావు, సుబ్రమణ్యం, డిఫెన్స్, యువత సభ్యులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, భక్తులు మరింతగా ఆలయ అభివృద్ధికి ముందుకు రావాలని సూచించారు.