Blue Corner Notice: గోవా(Goa)లోని ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత, క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు దేశం విడిచి థాయిలాండ్‌కు వెళ్లినట్టు గోవా పోలీసులు గుర్తించారు.
ఈ పరిణామం నేపథ్యంలో లూథ్రా సోదరుల స్థానం, కదలికల వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్‌పోల్(Interpol) ద్వారా బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయాలని గోవా పోలీసులు సీబీఐని అభ్యర్థించారు. ఇంటర్‌పోల్ కలర్-కోడ్ వ్యవస్థలోని ఈ నోటీసు నేర దర్యాప్తుకు అవసరమైన వ్యక్తుల సమాచారం సేకరించడానికి సభ్య దేశాల మధ్య సమన్వయం కల్పిస్తుంది.
ALSO READ:AP women loan scheme: ఏపీ మహిళలకు సర్కార్ శుభవార్త | 48 గంటల్లో ఖాతాల్లో రూ.8 లక్షలు
అధికారుల వెల్లడిన ప్రకారం, డిసెంబర్ 7 నాటికే బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ లుకౌట్ సర్క్యులర్ జారీ చేయగా, లూథ్రా సోదరులు ఇప్పటికే ఇండిగో విమానం ద్వారా ఫూకెట్‌కు వెళ్లినట్టు తెలిసింది.
ఎఫ్‌ఐఆర్ నమోదు అనంతరం ఢిల్లీలోని వారి నివాసాలపై దాడులు జరిగినప్పటికీ వారు అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకు నోటీసులు అంటించారని అధికారులు తెలిపారు.
మేజిస్ట్రియల్ విచారణ కొనసాగుతున్న సమయంలో, దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకే వారు త్వరగా దేశం విడిచినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.
Blue Corner Notice: లూథ్రా సోదరులపై ఇంటర్‌పోల్ అలర్ట్
Interpol issues Blue Corner Notice for Luthra brothers in Goa fire case
