రైతు భరోసా, రైతు రుణమాఫీ, కౌల్ రైతు మరియు ఇతర రైతు సమస్యల గూర్చి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజనల్ అధికారి పెద్దపల్లి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది .బిజెపి నాయకులు మాట్లాడుతూ పంట సాగు కోసం గత ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.10 వేలు రెండు విడతల్లో ఇవ్వగా అదే పథకాన్ని రైతు భరోసాగా మార్చి పంట పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.15 వేలు (ఖరీఫ్, రబీ సీజన్‌లో) ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా ఈ పథకం అమల్లోకి రాలేదు.
రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తామని రైతులను నమ్మబలికి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం , పంద్రాగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆగస్టు నెలాఖరులోగా రుణమాఫీ పూర్తవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని మంత్రులు స్పష్టం చేశారు.
కానీ ప్రభుత్వం చెప్పిన గడువు ముగిసి నెల రోజులు గడుస్తున్నా ఏదో ఆరకూర రుణమాఫీ చేశారు కానీ సంపూర్ణ రుణ మాఫీ చేయలేదు. అలాగే రెండు లక్షల పై రుణాలు ఉన్న రైతు సోదరుల ఊసే ఎత్తడం లేదు రాష్ట్ర ప్రభుత్వం.అలాగే అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కౌల్ రైతులకు కూడా చేయూతను ఇస్తామని హామీ ఇవ్వడం జరిగినది కానీ రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కి 10 నెలలు గడిసిన కౌలు రైతుల గురించి పట్టించుకోవడం లేదు వారి ఉసే ఎత్తడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీపావళి పండగ లోపు రైతులకు రైతు భరోసా ఇవ్వాలి, అలాగే సంపూర్ణ రుణమాఫీ చేయాలని, కౌలు రైతులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా అందోళత్మకా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్ పట్టణ అధ్యక్షులు కావేటి రాజగోపాల్ మండల అధ్యక్షులు మేకల శ్రీనివాస్ కౌన్సిలర్ రాజమహంత కృష్ణ శ్రీధర్ గుడ్ల సతీష్ కుక్క వంశీ బొడ్డుపల్లి కుమార్ గాండ్ల రాజేశం కరుణాకర్ చంద్రమౌళి మల్లేష్ పలువురు పాల్గొన్నారు.