MLA Mithali Thakur:బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(bihar elections) రాజకీయ అనుభవం లేకుండానే అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచిన మిథాలీ ఠాకూర్(Mithali Thakur) ఇప్పుడు ఆస్తుల విషయమై చర్చనీయాంశంగా మారింది. ఆమెకు దాదాపు 4 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు వెల్లడించారు.
ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి ప్రధాన బ్యాంకుల మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన మిథాలీ, ఎస్బీఐ ఇన్వెస్ట్‌మెంట్‌లో గత ఏడాది 18% రాబడి సాధించినట్లు తెలుస్తోంది.
పాలిటిక్స్‌తో పాటు గాయని, ఫైనాన్షియల్ ప్లానర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఆదాయం ఐదేళ్లలో విపరీతంగా పెరిగింది. 2019–20లో 12.02 లక్షలుగా ఉన్న వార్షిక ఆదాయం, 2023–24లో 28.67 లక్షలకు చేరుకుంది.
సోషల్ మీడియాలో పాటలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు ఆమెకు ప్రధాన ఆదాయ వనరులు.
ALSO READ:Visakhapatnam Illegal Beef Case: అక్రమ గోమాంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం
భూముల విషయంలో కూడా మిథాలీ పెట్టుబడులు లాభాలే తెచ్చాయి. గతంలో 47 లక్షలకు కొనుగోలు చేసిన ప్లాట్ విలువ ఇప్పుడు 1.5 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం ఆమె వద్ద 408 గ్రాముల బంగారం (53 లక్షల విలువ), 1.8 కోట్ల నగదు, అలాగే ఒక స్కూటీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో 13%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్‌లో 12% రిటర్న్స్ సాధించినట్లు నిపుణులు తెలిపారు.
