బీసీలకు రాజ్యాధికారం లభించాలంటే బీసీలు అందరూ కలిసి ఉంటేనే సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ అన్నారు. హనుమకొండ జిల్లా హాసన్పర్తిలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కులగణనను చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలందరూ గతంలో వేరువేరుగా ఉన్నారని కానీ ఇప్పుడు అందరం ఐక్యమతంగా గుర్తు చేశారు.. రానున్న రోజులలో వరంగల్ జిల్లాలో అతిపెద్ద బీసీల రాజ్యాధికార సభను నిర్వహిస్తున్నట్లు ఆయన, ఈ సభలకు జాతీయ బీసీ నాయకులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు…. అనంతరం హనుమకొండ జిల్లా నూతన కమిటీకి నియామక పత్రాలు అందజేసి బీసీల రాజ్యాధికారి దశగా ప్రజలను ఏకం చేయాలని దాసు సురేష్ నూతనంగా ఎన్నికైన కమిటీకి సూచించారు.
బీసీ సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ వ్యాఖ్యలు
