Sarpanch Election: నల్గొండ జిల్లా చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామ(Bangarigadda village) పంచాయతీలో సర్పంచ్ పదవి ఎన్నికలు విలక్షణంగా మారాయి. ఈసారి సర్పంచ్‌గా పోటీకి మొత్తం 11 మంది నామినేషన్ దాఖలు చేశారు.
అయితే గ్రామంలో జరుగుతున్న కనకదుర్గ ఆలయ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో స్థానికులు ఏకగ్రీవానికి ముందుకొచ్చారు. గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన చర్చల తర్వాత సర్పంచ్ పదవిని వేలంపాట ద్వారా నిర్ణయించాలని తేలింది.
ALSO READ:Telangana Vision 2047: రేవంత్ విజన్ 2047తో అభివృద్ధి ప్లాన్
ఈ వేలంపాటలో మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి రూ.73 లక్షలు చెల్లించేందుకు అంగీకరించడంతో ఆమెకు సర్పంచ్ పదవి కేటాయించబడింది. మిగతా 10 మంది అభ్యర్థులు ఈ నిర్ణయాన్ని అంగీకరించి తమ నామినేషన్లను వెనక్కి తీసుకుంటామని ఒప్పంద పత్రంపై సంతకం చేశారు.
దీంతో బంగారిగడ్డ గ్రామ పంచాయతీ అధికారికంగా ఏకగ్రీవంగా ప్రకటించబడింది.
