Urban Naxals Issue: అర్బన్ నక్సలైట్లను నమ్మి మోసపోవద్దు:బండి సంజయ్

Banndi Sanjay addressing Maoists and criticizing Urban Naxals during Sirisilla visit Banndi Sanjay addressing Maoists and criticizing Urban Naxals during Sirisilla visit

మావోయిస్టులు(Maoists) అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి మోసపోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(bandi sanjay) పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల పర్యటనలో భాగంగా వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందజేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఏ పార్టీ అధికారంలో ఉన్నా అర్బన్ నక్సలైట్లు పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటారని ఆరోపించారు.

అర్బన్ నక్సలైట్లు చెప్పిన మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. తిండి తిప్పలు లేని పరిస్థితులకు ఈ అర్బన్ నక్సలైట్లే కారణమని, మావోయిస్టుల చావుకు కూడా వీరే బాధ్యులని వ్యాఖ్యానించారు.

ALSO READ:Revanth Reddy | మోదీ దేశానికి పెద్దన్న…అన్ని రాష్ట్రాలకి  సహకరించాలి 

అర్బన్ నక్సలైట్లు దేశద్రోహులని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నక్సలైట్లు తుపాకీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.

మావోయిస్టులకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉందని, వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *