శిక్షణ పేరుతో 16ఏళ్ల అమ్మాయిపై కోచ్ అత్యాచారం

Badminton coach Suresh Balaji rapes minor girl. Nude photos on a phone led to the crime's exposure. Badminton coach Suresh Balaji rapes minor girl. Nude photos on a phone led to the crime's exposure.

బ్యాడ్మింట‌న్ శిక్ష‌ణ తీసుకుంటున్న ఓ 16 ఏళ్ల అమ్మాయిని కోచ్(Badminton Coach) రేప్ చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు సురేశ్ బాలాజీ అనే వ్య‌క్తిని సోమ‌వారం అరెస్టు చేశారు. అమ్మ‌మ్మ‌ ఫోన్ నుంచి గుర్తు తెలియ‌ని నెంబ‌ర్‌కు న‌గ్న ఫోటోల‌ను షేర్ చేయ‌డంతో ఆ అమ్మాయి రేప్‌కు గురైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆ ఫోటోల‌ను చూసిన అమ్మ‌మ్మ‌.. ఈ విష‌యాన్ని పేరెంట్స్‌కు తెలియ‌జేసింది. త‌ల్లి గ‌ట్టి ప్ర‌శ్నించ‌గా. ఆ అమ్మాయి త‌న‌కు జ‌రిగిన అన్యాయం చెప్పేసింది. బ్యాడ్మింట‌న్ శిక్ష‌ణ ఇస్తున్న కోచ్ త‌న‌ను ప‌లుమార్లు లైంగికంగా వేధించిన‌ట్లు ఆ యువ‌తి చెప్పింది. అద‌న‌పు కోచింగ్ ఇస్తాన‌ని మ‌భ్య పెట్టాడ‌ని, విష‌యం ఎవ‌రికీ చెప్ప‌వ‌ద్దు అని వార్నింగ్ ఇచ్చాడు.

పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. బాధితురాలు రెండేళ్ల క్రితం బ్యాడ్మింట‌న్ అకాడ‌మీలో కోచింగ్ కోసం చేరిన‌ట్లు ఆమె త‌ల్లి చెప్పింది. కోచ్ ప‌లు మార్లు త‌న కూతుర్ని వేధించిన‌ట్లు ఆమె పేర్కొన్న‌ది. ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోపించింది. ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష‌లు ముగిసిన త‌ర్వాత ఆ అమ్మాయి అమ్మ‌మ్మ ఇంటికి వెళ్లింది. అయితే మార్చి 30వ తేదీన అమ్మ‌మ్మ ఫోన్ నుంచి న‌గ్న చిత్రాల‌ను గుర్తు తెలియ‌ని నెంబ‌ర్‌కు వాట్సాప్ చేసింది.

బాధితురాలి త‌ల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు రిజిస్ట‌ర్ చేశారు. బ్యాడ్మింట‌న్ కోచ్ త‌మిళ‌నాడు వ్యక్తిగా గుర్తించారు. అత‌నిపై పోక్సో చ‌ట్టం కేసు న‌మోదు చేశారు. ప‌లు మార్లు ఆ అమ్మాయిని లైంగికంగా వేధించిన‌ట్లు పోలీసులు విచార‌ణ‌లో కోచ్ అంగీకించాడు. అమ్మాయి న‌గ్న చిత్రాలు తీసిన‌ట్లు అత‌ని ఫోన్‌లో ఉన్నాయి. అత‌ని ఫోన్ నుంచి పోలీసులు మ‌రికొంత మంది అమ్మాయిల‌ న్యూడ్ ఫోటోల‌ను గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *