ప్రకృతి విపత్తులు,ప్రమాదాలు సంభవించినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డిఆర్ఎఫ్)10వ బెటాలియన్ వారు జిల్లా కలెక్టర్ మరియు (ఎస్.ఆర్.ఎఫ్.) 10వ టెటాలియన్ కమాండెంట్ వి ఏపి ఎన్ ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు ఎ శ్రీనివాసరావు, తహశీల్దార్, రాంబిల్లి ఆధ్వర్యాన బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు మరియు కూక్ డ్రిల్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాంబిల్లి సిఐ.సిహెచ్. నరసింగారావు,యలమంచిలి అగ్నిమాపక శాఖాధికారి డి రాంబాబు మరియు సిబ్బంది, రాంబిల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అదపాక రవి కుమార్, పాఠశాల ప్రదానోపాధ్యాయులు వేణుగోపాల్, ఎన్. డి.ఆర్. ఎఫ్. సిబ్బంది బి.సతీష్, వి.శంకర రావు, విఆర్వోలు సుబ్రహ్మణ్యం, నాగేశ్వరావు, రమణ, విఆర్ఏలు దుర్గా, శివ, అప్పలరాజు, ప్రసాద్, ఉపాద్యాయులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొనారు.