కాకినాడ జిల్లా, పత్తిపాడు మండలంలో వంతాడ గ్రామాన్ని సందర్శించిన దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపకులు బుంగ సతీష్ కుమార్, అక్కడి ప్రజలతో మమేకమయ్యారు.
వారు గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు.
బుంగ సతీష్ మాట్లాడుతూ, వంతడ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు 150 సంవత్సరాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కనీసం దారి మార్గం కూడా లేకపోవడం కష్టంగా ఉందన్నారు.
గ్రామస్తులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నప్పటికీ, ప్రభుత్వ నుండి కనీస వసతులు లేదా ఉపాధి లభించడం లేదని వారు పేర్కొన్నారు.
ప్రజల పరిస్థితిపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ మరియు పాఠశాలలో కూడా అవసరమైన సౌకర్యాలు లేవని ఆరోపించారు.
విద్యార్థులకు బాత్రూమ్స్ లేకపోవడం వల్ల వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
గర్భిణి స్త్రీలకు రోడ్డు మార్గం లేకపోవడం వల్ల, డెలివరీ సమయంలో అంబులెన్స్ సౌకర్యం లేకుండా చాలా కష్టాలు పడుతున్నారని తెలిపారు.
ఇది అత్యంత తీవ్ర సమస్యగా ఉందని బుంగ సతీష్ పేర్కొన్నారు.
ఈ సమస్యలను కలెక్టర్ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని ఆయన మీడియాకు చెప్పారు.
గ్రామస్తుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్, దళిత నాయకులు కాకర అప్పారావు, గ్రామస్తులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారు కూడా సమస్యలపై మాట్లాడారు.
ఈ సందర్శన ద్వారా, వంతడ గ్రామంలోని దళితుల సమస్యలను పరిష్కరించేందుకు చట్టసభ అనుసరించాల్సిన అవసరం ఉన్నదని బుంగ సతీష్ తెలిపారు.