Apple Production in India: ప్రతి 5 iPhones‌లో 1 భారత్‌లోనే తయారీ 

Apple iPhone production and sales statistics in India Apple iPhone production and sales statistics in India

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు భారతదేశంలో విక్రయాలు పెరుగుతున్నా… ప్రపంచవ్యాప్త అమ్మకాలతో పోలిస్తే
2024–25 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ ఇండియా రికార్డు స్థాయిలో రూ. 79,807 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది.

అయితే ఈ భారీ విక్రయాలున్నప్పటికీ, యాపిల్ గ్లోబల్ రెవెన్యూ రూ. 36.89 లక్షల కోట్లలో భారత్‌ వాటా కేవలం “2 శాతం మాత్రమే” ఉందని మార్కెట్ విశ్లేషణలు పేర్కొన్నాయి.

ALSO READ:iBomma రవిని స్వయంగా విచారించిన సజ్జనార్ – విచారణలో కీలక అంశాలు వెలుగులోకి 

అమ్మకాల పరంగా భారత దేశం స్థానం అతితక్కువగా ఉన్నప్పటికీ, “ఉత్పత్తిలో మాత్రం భారత్‌ పాత్ర వేగంగా పెరుగుతోంది”. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా తయారైన ప్రతి “5 iPhone‌లలో ఒకటి భారత్‌లోనే ఉత్పత్తి” అవుతోందని పరిశ్రమ సమాచారం వెల్లడించింది.

యాపిల్ గ్లోబల్ ప్రొడక్షన్ వాల్యూలో భారత్‌ వాటా “12% వరకు పెరిగింది”, ఇది గతంతో పోలిస్తే కీలక పురోగతిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *