ఏపీ టెట్ 2024 ఫలితాలు విడుదల

The results for the Andhra Pradesh Teacher Eligibility Test (AP TET 2024) have been announced, with Minister Nara Lokesh releasing the results. A total of 3,68,661 candidates appeared for the exam, and 1,87,256 (50.79%) qualified.

ఏపీలో ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ 2024) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ నిర్వహించారు. తాజాగా ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. నిజానికి ఈ నెల 2నే ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా తుది కీ వెల్లడిలో ఆలస్యం కారణంగా నేడు విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ఎక్స్ ద్వారా స్పందించారు. రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌లో నిర్వహించిన టెట్-2024 ఫలితాలను ఈరోజు విడుదల చేసినట్టు పేర్కొన్నారు.

ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరుకాగా, అందులో 1,87,256 (50.79 శాతం) మంది అర్హత సాధించినట్టు తెలిపారు. ఫలితాలను సిఎస్‌ఈ.ఎపీ.గోవ్.ఇన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. టెట్ లో అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *