Pawan Kalyan: ప్రపంచకప్ విజేతలుగా నిలిచి మహిళలు దేంట్లోను తక్కువ కాదని నిరూపించి భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి మరియు యువతకు స్ఫూర్తిగా నిలిచినా మన అంధుల మహిళా క్రికెట్ జట్టును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా సత్కరించారు.
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జట్టు సభ్యులు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్‌తో పవన్ ప్రత్యేకంగా సమావేశమై అభినందనలు తెలిపారు. క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, కోచ్‌లకు రూ.2 లక్షల చెక్కులు అందజేశారు. అదనంగా ప్రతి క్రీడాకారిణికి పట్టు చీర, శాలువా, జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులు అందించారు.
ALSO READ:Ratan Tata Road | ఫ్యూచర్ సిటీకి 8-లేన్ హైవే నిర్మాణం పనులు ప్రారంభం
అంధ మహిళా క్రికెటర్లు సాధించిన ఈ విజయం దేశానికి గర్వకారణమని పవన్ అన్నారు. వారి సాధన కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక సదుపాయాల కోసం అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు.
జట్టు ప్రతినిధులు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ప్రపంచకప్ విజేతల జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కెప్టెన్ దీపిక, కరుణా కుమారిని ప్రత్యేకంగా అభినందించారు.
కెప్టెన్ దీపిక తమ గ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా తంబలహట్టి తండాకు రహదారి అవసరమని కోరగా, వెంటనే చర్యలు తీసుకోవాలని పవన్ అధికారులకు ఆదేశించారు. అలాగే కరుణా కుమారి చేసిన విజ్ఞప్తులపైనా వెంటనే చర్యలు చేపట్టాలని పవన్ సూచించారు.
