ప్రపంచమంతా పూలతో పూజిస్తే… పూలను పూజించే గొప్ప సంస్కృతి మనది. ప్రకృతి ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రీతిక మన బతుకమ్మ. పండగ. పండగ అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు ఈ మహోన్నత వేడుక జరుగును. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను పేరుస్తారు. సాధారణంగా అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మను పేరుస్తారు ఆరోజు నుండి ప్రారంభం అయ్యే బతుకమ్మ సందడి తొమ్మిది రోజులు జరుగుతుంది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించారు.మహిళలందరూ కలిసి ఎంతో ఉత్సవంగా ఎంగిల పూల బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ వేడుకను జరుపుకున్నారు వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చిన మహిళలు బతుకమ్మ ను మధ్యలో ఉంచి కోలాటం ఆడారు
