Amruta Fadnavis Contraversy: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన సందర్భంగా ఊహించని వివాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్, మెస్సీతో సెల్ఫీ దిగిన తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ప్రవర్తన అగౌరవంగా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన మెస్సీ, ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రాజెక్ట్ మహాదేవ”(project mahadev) ఫుట్‌బాల్ అభివృద్ధి కార్యక్రమాన్ని మెస్సీ ప్రారంభించారు.
ALSO READ:Jio New Year Plans | జియో బంపర్ ఆఫర్…పండగ చేసుకోండి
ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్, భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అమృత ఫడ్నవిస్ పదేపదే మెస్సీతో(lionel messi) సెల్ఫీకి ప్రయత్నించడం, చూయింగ్ గమ్ నములుతూ ఫొటోలకు పోజులివ్వడం వంటి దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. అలాగే మెస్సీ పక్కన నిలబడేందుకు ఫుట్‌బాలర్ రోడ్రిగో డి పాల్‌ను పక్కకు జరగమని కోరినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వీడియో వైరల్ కావడంతో మెస్సీ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అనంతరం అమృత ఫడ్నవిస్ మెస్సీతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, దానిపైనా విమర్శాత్మక కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ ఘటనతో మెస్సీ భారత పర్యటన మరోసారి వార్తల్లో నిలిచింది.
