మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో గురువారం కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో 20వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి మండపం వరకు సింగిడి కేరళ బ్యాండ్ చే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో కులమతాలకు అతీతంగా అమ్మవారి ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం విగ్రహాదాతగా కొండగారి స్వామి విగ్రహాన్ని అందించడం జరిగిందన్నారు. నవరాత్రులు అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు కుంకుమార్చన, అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు 9 రోజులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు, లింగం గౌడ్, లక్ష్మ గౌడ్, ఎర్ర గౌడ్, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, వేణు గౌడ్, వెంకటేష్ గౌడ్, కౌండిన్య యూత్ సభ్యులు పాల్గొన్నారు.
నస్కల్ గ్రామంలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం
