పుష్ప-2 లో అల్లు అర్జున్‌, శ్రీలీల స్పెషల్‌ సాంగ్‌

The much-awaited film Pushpa-2 The Rule starring Allu Arjun will feature a high-energy item song with Sreeleela. Devi Sri Prasad has composed the music with lyrics by Chandrabose. The much-awaited film Pushpa-2 The Rule starring Allu Arjun will feature a high-energy item song with Sreeleela. Devi Sri Prasad has composed the music with lyrics by Chandrabose.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప-2 ది రూల్‌ చిత్రం డిసెంబరు 5న విడుదల కానుంది. గతంలో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రం సంచలన విజయం సాధించడం, అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్రలో మాస్సివ్ మేనరిజం అందరినీ మెప్పించడం ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ సినిమా నిర్మాణానంతర పనులు కూడా జరుపుకుంటోంది.

పుష్ప ది రైజ్ చిత్రంలోని “ఊ అంటావా మామా” పాట ఎంత పాప్యులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప-2 ది రూల్‌లోనూ అలాంటి ప్రత్యేకమైన ఐటెమ్ సాంగ్ ఉండనుంది. ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి నర్తించబోయే హీరోయిన్ ఎవరు అనేది చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ ప్రత్యేక గీతంలో శ్రీలీల అల్లు అర్జున్‌కి జోడీగా డ్యాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్‌ డ్యాన్స్ ఇమేజ్‌కి సరిసమానంగా శ్రీలీల ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సాంగ్ కోసం మాస్ బాణీలను సమకూర్చగా, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సాంగ్ పుష్ప-2 కోసం ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉంటుందని చిత్రబృందం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *