Akhanda 2: డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన “అఖండ 2” సినిమా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా విజయోత్సవ వేడుకల్లో భాగంగా బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, చిత్ర బృందం వారణాసిని సందర్శించింది. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ‘అఖండ 2’ కేవలం తెలుగు సినిమా కాదని, భారతీయులందరికీ సంబంధించిన చిత్రమని వ్యాఖ్యానించారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ అవసరాన్ని ఈ సినిమా స్పష్టంగా చాటిందన్నారు. మంచి ఉద్దేశంతో చేసిన సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకిందని తెలిపారు.
ALSO READ:Sabarimala gold idol misuse case | బంగారు విగ్రహాల కేసులో ఈడీ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ గ్రీన్
సినిమా అనేది కేవలం నటనకే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలతో కనెక్ట్ అయ్యే శక్తివంతమైన మాధ్యమమని బాలయ్య పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించగా, రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
