ఎయిర్ ఇండియా అమెరికా రూట్‌లలో 60 విమానాలను రద్దు చేసింది

Due to maintenance issues and aircraft availability, Air India has canceled 60 flights on U.S. routes between November 15 and December 31, offering alternative arrangements and full refunds to passengers Due to maintenance issues and aircraft availability, Air India has canceled 60 flights on U.S. routes between November 15 and December 31, offering alternative arrangements and full refunds to passengers

నిర్వాహణ సమస్యలు, ఎయిర్ క్రాఫ్ట్ ల కొరత కారణంగా ఎయిర్ ఇండియా అమెరికా రూట్‌లలో 60 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నిర్ణయం నవంబర్ 15 నుండి డిసెంబర్ 31 వరకూ ప్రభావం చూపుతుంది. ఎయిర్ ఇండియా తన ప్రకటనలో ఈ రద్దును ప్రకటిస్తూ, ప్రయాణీకులకు సమాచారం అందించినట్లు తెలిపింది. సంస్థ ప్రయాణికులకు సౌకర్యంగా ఇతర సర్వీసులలో సీట్లు అందజేయడంతో పాటు పూర్తి రిఫండ్ అందజేస్తుంది.

రద్దు చేసిన సర్వీసుల్లో ఢిల్లీ – చికాగో మధ్య 14 విమానాలు, ఢిల్లీ – వాషింగ్టన్ రూట్‌లో 28 విమానాలు, ఢిల్లీ – ఎస్ఎఫ్‌వో మధ్య 12 విమానాలు ఉన్నాయి. అలాగే, ముంబై – న్యూయార్క్ రూట్‌లో నాలుగు విమానాలు, ఢిల్లీ – నెవార్క్ రూట్‌లో రెండు విమానాలను రద్దు చేసింది. ఈ రద్దు వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని సంస్థ హామీ ఇచ్చింది.

ప్రయాణికులకు తగిన ఏర్పాట్లతో పాటు పూర్తి రీఫండ్‌ను అందించే ప్రక్రియ చేపట్టామని ఎయిర్ ఇండియా ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *