Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeInterNationalమాస్కో కోర్టు గూగుల్‌కు 20.6 డెసిలియన్ డాలర్ల భారీ జరిమానా

మాస్కో కోర్టు గూగుల్‌కు 20.6 డెసిలియన్ డాలర్ల భారీ జరిమానా

-

Chat on WhatsApp

రష్యాలోని మాస్కో కోర్టు గూగుల్‌కి అత్యంత భారీ జరిమానాను విధించింది. రష్యా ప్రభుత్వ అనుకూలంగా ఉండే కొన్ని చానళ్లను యూట్యూబ్‌లో తిరిగి ప్రసారం చేయాలని కోర్టు ఆదేశించింది. గూగుల్ ఈ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో కోర్టు 20.6 డెసిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ మొత్తం ప్రపంచ స్థాయిలో ఉన్న మొత్తం జీడీపీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఇది చెల్లించడం గూగుల్‌తో పాటు మరే సంస్థకు సాధ్యం కాని పరిస్థితి.

ఈ వివాదానికి కారణం రష్యా ప్రభుత్వ అనుకూల 17 చానళ్లను గూగుల్ యూట్యూబ్‌లో నిలిపివేయడమే. ఈ చానళ్లను తిరిగి ప్రసారం చేయాలంటూ మాస్కో కోర్టు సూచించింది. అయినప్పటికీ గూగుల్ పునరుద్ధరించకపోవడంతో కోర్టు అత్యంత భారీ జరిమానాను విధించింది. గూగుల్ సంస్థ మాత్రం రష్యా టీవీ చానళ్ల యజమానులకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్ కోర్టుల్లో కేసులు వేసింది.

ఈ జరిమానా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కి మాత్రమే కాకుండా, ఈ భూమ్మీద ఉన్న మరే సంస్థకు చెల్లించటం అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ap eapcet 2026 results announced by minister nara lokesh

AP EAPCET 2026 ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు ఇవే

AP EAPCET Results 2026 Out: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన AP EAPCET 2026 పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...
- Advertisement -
Chat on WhatsApp