ఏజెన్సీ ప్రాంతాల నుండి మైదాన ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న స్కూటీ ఎదురుగా వస్తున్న ఒక కారును ఢీ కొనడంతో తీవ్ర గాయాలు పాలయ్యారు దీనితో వాళ్ల తరలిస్తున్న గంజాయి బయట పడింది. జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని గోకవరం శివారు సాయి ప్రియాంక లేఔట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడంతో యువకులకు గాయాలు కాగా ఒక యువకుడికి కుడికాలు ప్యాక్చర్ అయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు 108 లో రాజమండ్రి తరలించినట్లు తెలిసింది. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు. రోడ్డు ప్రమాదం జరిగిన విషయం అందుకున్న గోకవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే వివరాలు సేకరించడంలో వారు గంజాయి తరలిస్తున్నట్లు తెలిసింది వారి దగ్గర గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారట సమాచారం. ఇది ఎలా ఉండగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజులలో ఈ వారంలోనే రాజానగరం నియోజకవర్గంలోని గంజాయి డ్రగ్స్ వేరే రాష్ట్ర నిషేధిత మందు బాటిల్స్ పట్టుకున్న సంఘటన ముచ్చటగా మూడు రోజులు కూడా ఇవ్వకుండానే గోకవరం నుండి రాజమండ్రి వెళ్లే మార్గంలో ఈరోజు గంజాయి పట్టుకోవడం విశేషం దారి పొడవునా ఎక్కడకక్కడ పగడ్బందీగా అటవీశాఖ పోలీస్ చెక్పోస్టులు ఉన్న దర్జాగా వస్తున్నారంటే అధికారుల పనితీరు పైన పలు అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
అనేక చెక్ పోస్ట్ లు ఉంటున్నాయి అయినా ఏమవుతుంది రోడ్డు ప్రమాదం జరగడం లోనే దొరికారా అంటే ఇలా ఎన్ని వెళ్ళిపోతున్నాయో అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.