భారత రాజ్యాంగం 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా, అదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 1949, నవంబర్ 26న ఆమోదించబడిన భారత రాజ్యాంగం ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడింది.
ఈ సందర్భంగా, శ్యామలాదేవి తన ఛాంబర్‌లో భారత రాజ్యాంగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె భారత ప్రజల హక్కులను, సమానతలను, స్వేచ్ఛను అందిస్తూ, 1949, నవంబర్ 26 న ఆమోదించబడిన రాజ్యాంగాన్ని అనుసరించేందుకు, రాజ్యాంగ విలువలపై ప్రతిజ్ఞ చేశారు.
“భారతదేశాన్ని సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రంగా నిర్మించుకోవడానికి, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడం, స్వాతంత్ర్యాలను కల్పించడం, సమానత్వాన్ని చేకూర్చడం” అని ఆమె పేర్కొంది. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ AO రామిరెడ్డి, రెవెన్యు విభాగం సిబ్బంది, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.