రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు బూర్జ్ గ్రామంలో ఈరోజు రాలి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ టి హేమాక్షి ఆధ్వర్యంలో దేశ్ కా ప్రకృతి పరీక్ష అభయాన్ కార్యక్రమం ప్రారంభించబడింది.
ఈ కార్యక్రమం భాగంగా, వారం రోజులపాటు అవేర్నెస్ డ్రైవులు మరియు మారుమూల గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ హేమాక్షి వెల్లడించారు. ఇంటింటా ప్రకృతి పరీక్ష, ఆరోగ్యపరిశీలన కార్యక్రమాలు ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్య పరిరక్షణలో భాగస్వామ్యం అవ్వాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. గ్రామ ప్రజలలో ఆరోగ్య గురించిన అవగాహన పెంచడం కోసం ఈ కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందని డాక్టర్ హేమాక్షి పేర్కొన్నారు.
ఈ ర్యాలీ ద్వారా గ్రామస్థులలో ప్రకృతి పరీక్ష, ఆరోగ్యం మరియు ఆయుర్వేద వైద్యం పై అవగాహన పెరిగింది. ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్య స్థితిని మెరుగుపర్చడంలో ఒక గొప్ప దశగా మారింది.