సంతాన లేమి సమస్యలు తీరుస్తూ దంపతుల కళ్ళల్లో ఆనందాన్ని అందిస్తుంది ఓయాసిస్ ఫెర్టిలిటీ అని డాక్టర్ జలగం కావ్య రావు అన్నారు.ఈ సందర్భంగా వరంగల్ నగరంలోని భద్రకాళి బంద్ లో ఒయాసిస్ ఫెసిలిటీ హనుమకొండ మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. అదేవిధంగా వయాసిస్ ఫెర్టిలిటీ ద్వారా సంతానాన్ని పొందిన దంపతులు పిల్లలు కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్లు కావ్య రావు, కృష్ణ చైతన్య మాట్లాడారు. సంతానం అనేది వివాహమైన దంపతులకు ఒక కలలాంటిది అన్నారు. సంతానం లేకపోతే ఇబ్బందులు సమాజంలో వారు పడే బాధలు డాక్టర్ ప్రసన్న వర్ణనాతీతం అన్నారు.అలాంటి వారి కలను నిజం చేయడానికి తమ ఒయాసిస్ ఫెర్టిలిటీ ఎంతో బాధ్యతాయుతంగా కృషి చేస్తూ దంపతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రోహిత్ భోజరాజు, అంజనీదేవి,విజయలక్ష్మి, ప్రసన్న పాల్గొన్నారు.
హనుమకొండలో ఒయాసిస్ ఫెర్టిలిటీ వార్షికోత్సవం
