బంగారు నగలు విక్రయాల్లో నాణ్యతకు తగిన బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులపై కమర్షియల్ సేల్స్ టాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. జీఎస్టీ చెల్లించకుండా విక్రయాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
సుమారు 20 మంది అధికారులతో కూడిన బృందం ఏక కాలంలో దాడులు నిర్వహించగా, అనధికారికంగా బంగారం విక్రయాలు చేస్తున్న దుకాణాలు మూసివేస్తూ బంగారాన్ని బ్యాగుల్లో తరలించే దృశ్యాలు కనిపించాయి.
అధికారుల దాడుల కారణంగా బి.కొత్తకోటలో పలు బంగారు దుకాణాలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. బంగారం నిల్వల వివరాలు సమర్పించాలనే నోటీసులు సంబంధిత షాపులకు అందజేశారు.
నాణ్యతలేని బంగారంతో పాటు బిల్లులు లేకుండా విక్రయాలు జరిపే వారికి కఠిన చర్యలు తీసుకుంటామని కమర్షియల్ సేల్స్ టాక్స్ అధికారులు హెచ్చరించారు. దాడుల ద్వారా పన్ను ఎగవేతకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశం అధికారులది.