మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై తీవ్రమైన విమర్శలు చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని చెప్పారు. ఆయన గొప్ప నిజాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం బడ్జెట్‌ను ఆలస్యం చేసినందుకు చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఆలస్యం జరిగింది అని, అప్పులపై జవాబులు చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఎల్లో మీడియా కూడా ఆయన వైపు ఉందని అన్నారు.
కాగ్ రిపోర్ట్‌పై కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఆయన గతంలో పెద్ద అప్పులు చేయగా, ఇప్పుడు వైసీపీ అధికంగా అప్పులు చేశాయని వక్రీకరించి మాట్లాడుతున్నారని విమర్శించారు. 19 శాతం అప్పులు పెరిగినట్లుగా చంద్రబాబు చెబుతూనే, 15 శాతం మాత్రమే పెరిగినట్లు వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చంద్రబాబు తమ హయాంలో చేసినట్లుగా చెప్పుకుంటున్నారని, వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం రూ.25 లక్షల పరిధిలో ఈ స్కీం పెంచిందని తెలిపారు. 3,762 కోట్ల రూపాయలను వైసీపీ ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేసిందని, చంద్రబాబు దాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ స్కీం కింద చూపిస్తున్నారని అన్నారు.