ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ పరిధిలోని ఫణిగిరి కాలనీ లో బస్తినిద్ర కార్యక్రమంలో ఈ మాటలను ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన మరుసటి రోజు తెల్లవారుజామున న్యూ మారుతి నగర్ , సత్యా నగర్, పనిగిరి కాలనీలలో పాదయాత్ర చేస్తూ కాలనీల వాసులందరికీ ధైర్యంగా ఉండాలని మీకు మేము అండగా ఉన్నామని చెప్పడంతో కాలనీల వాసులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఫణిగిరి కాలనీ సాయిబాబా గుడి ఆవరణలో మూసి బాధితులతో మాట్లాడడం జరిగింది.
తదనంతరం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందని, మూసీ నది సుందరీకరణ పేరుతో పేద ప్రజలను గత మూడు నెలల నుండి నిద్రాహారాలు లేకుండా చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసి పరివాహక ప్రాంత ప్రజలకు ఇల్లు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం చెల్లించి వారికి హామీ ఇస్తే అభివృద్ధికి అందరం సహకరిస్తామని, ఈ కాలనీలో ప్రజలు ఇండ్లు కోల్పోతామని ఆవేదనతో బ్రేన్ స్టోక్, హార్ట్ స్ట్రో క్, పలు రోగాల బారిన పడి ఉన్నారని, అలాంటి బాధిత కుటుంబాలకు బిజెపి పార్టీ అండగా ఉంటుందని, హైదరాబాదులో మూసి పరివాహకం అంటే చైతన్యపురి డివిజన్ ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపిస్తుందని ఇక్కడ గజం ధర లక్షలు పలకడం వలన ప్రభుత్వం వీటిపై ఎక్కువగా దృష్టి సారించిదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు ఏమాత్రం అవగాహన లేదని తల ఒక మాట మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించి మూసి పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలకు న్యాయం చేయాలని అని పేర్కొన్నారు.