ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో వందకు పైగా కుక్కలకు ఒక రకమైన వింత వైరస్ వ్యాప్తి చెందింది. అది నగర పంచాయతీ కమిషనర్ గారి దృష్టికి వెళ్లిందో లేదో నాకు తెలియదు. దీనివల్ల కుక్కలకు చర్మం పైన ఉన్న వెంట్రుకలు రాలిపోతున్నాయి. తరువాత తోలు ఊడిపోతుంది. తరువాత దురదలు వస్తున్నాయి. తరవాత ఆ కుక్క వింత చేష్టలు చేసి రోడ్డుపై చచ్చిపోతుంది. దీనిని వెంటనే మీరు ఒక నగర పంచాయతీ కమిషనర్ గా చర్యలు తీసుకోకపోతే ఈ వ్యాధి ప్రజలకు సోకి ప్రజలు కూడా వింత రకమైన రోగాల బారిన పడతారు. అప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అది తమరు దృష్టిలో పెట్టుకొని మన నగర పంచాయతీ పరిధిలో ఉన్న కుక్కలను ముందుగా పరీక్షలు చేయించి ఏ వ్యాధి సోకింది అని తెలుసుకున్న తరువాత కుదిరితే వాటికి యాంటీ డోస్ ఇప్పించండి. లేకపోతే కుక్కలను అన్నిటిని పట్టుకొని ఏదైనా వ్యాన్ లో ఎక్కించుకొని అడవుల్లో వదిలివేస్తే చింతలపూడి పంచాయతీని మీరు రక్షించిన వారు అవుతారు. లేకపోతే చాలా తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి…. కుక్కలు పంది పిల్లల్లో మారుతున్నాయి.
చింతలపూడి లో వింత వైరస్‌తో వందలాది కుక్కలు ఆందోళనకర స్థితి
