శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం దాడిపల్లి గ్రామం వద్ద పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఆపకుండా బొలెరో వాహనం వెళ్లి పోవడంతో వెంబడించిన పోలీసులకు 563.920 కేజీల గంజాయి పట్టుబడిందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇందులో ముగ్గురు వ్యక్తులతో పాటు సదరు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇప్పటికే గంజాయి పై గట్టి నిఘా ఉంచామన్నారు. ఎవరైనా గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
శ్రీకాకుళంలో 563 కేజీల గంజాయి పట్టివేత, ముగ్గురు అరెస్ట్
