చేగుంట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు ప్రముఖ సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి తన చిన్న కుమారుడు కార్తికేయ, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు కుర్చీలు మరియు టేబుల్ లు అందజేశారు. ఈ సందర్భంగా అయిత పరంజ్యోతి వడ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ చిన్నపిల్లలు వారి ఆనందం చిరునవ్వులే మనకు ఆశీర్వాదాలని వారికోసం ఎంత చేసిన తక్కువేనని తెలిపారు. చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ముందు ముందు మరిన్ని సేవలందిస్తామని వారు తెలిపారు, వడ్ల నవీన్ కుమార్ అయిత కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడి కేంద్రాలలో చదువుకున్న చిన్నారులకు కుర్చీలు ఇవ్వడం చాలా సంతోషమని అంగన్వాడి టీచర్లు అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆయిత వెంకటలక్ష్మి రఘురాములు, అయిత పరంజ్యోతి వడ్ల నవీన్ కుమార్, సంధ్యారాణి, అంగన్వాడి టీచర్లు రేణుక, వాణి,సుగుణ, పద్మ, ఆయాలు, జ్యోతి,సంతోషమ్మ,అమాలి సంఘం అధ్యక్షులు వెంకటేష్, ఎగ్గఢీ శేఖర్,కార్తికేయ, బన్నీ, బంటి, రామలింగం, రఘు రాములు, సిద్ధి రాములు, స్టాలిన్ ( నర్సింలు ) , విష్ణు, సోమరాజు,పండు, వికాస్, చేతన్ , శ్రీలేఖ,ఆయాలు, చిన్నారు తదితరులు పాల్గొన్నారు.