ట్రంప్ విజయం తర్వాత గూగుల్ సెర్చ్ లో అమెరికన్లు

Following Donald Trump's election victory, Americans flooded Google with searches on immigration, Scottish citizenship, and LGBTQ+ rights in Scotland. Following Donald Trump's election victory, Americans flooded Google with searches on immigration, Scottish citizenship, and LGBTQ+ rights in Scotland.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత గూగుల్ సెర్చ్ విస్తారంగా పెరిగింది. ట్రంప్ విజయం విషయం తెలిసిన తర్వాత, అనేక మంది అమెరికన్లు పునరావాసం, స్కాటిష్ సిటిజెన్‌షిప్, అబార్షన్, ఎల్‌జీబీటీ క్యూ ప్లస్ హక్కులు వంటి అంశాలపై గూగుల్‌లో సెర్చ్ చేశారు. ముఖ్యంగా ఒరెగావ్, కొలరాడో, వాషింగ్టన్, టెనస్సీ, మిన్నెసొటా వంటి రాష్ట్రాల ప్రజలు ఈ సెర్చ్‌లలో భాగమయ్యారు.

ఇమ్మిగ్రేషన్ విధానాలకు ప్రసిద్ధి చెందిన న్యూజిలాండ్, ఐర్లాండ్, కెనడా వంటి దేశాలను కూడా చాలామంది సెర్చ్ చేశారు. స్కాటిష్ సిటిజెన్‌షిప్ పొందడానికి సంబంధించిన వివరాలు, స్కాట్లాండ్‌లో అబార్షన్ చట్టబద్ధమా?, ట్రాన్స్ హక్కులు వంటి విషయాలను తెలుసుకోవడానికి గూగుల్‌ను విస్తారంగా వాడుకున్నారు. ట్రంప్ అధికారంలోకి రావడం వల్ల అబార్షన్, ఎల్‌జీబీటీ క్యూ ప్లస్ హక్కులకు సంబంధించి మార్పులు ఉండొచ్చని వారు భావించారు.

‘స్కాటిష్ గ్రీన్స్’ కో లీడర్ పాట్రిక్ హర్వీ మాట్లాడుతూ, ట్రంప్ విజయం తర్వాత అమెరికన్లు ఇలాంటి విషయాలను సెర్చ్ చేయడం ఆశ్చర్యం కాదని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *