ఎన్‌టీఆర్ కుమారులతో వెంకీ సరదా

Tollywood star NTR's sons captured in a viral video enjoying playful moments with veteran actor Venkatesh at Nithin's engagement ceremony, delighting fans.

టాలీవుడ్ యువ హీరో జూనియ‌ర్ ఎన్‌టీఆర్ బావ‌మ‌రిది నార్నె నితిన్ ఎంగేజ్మెంట్ వేడుక ఘ‌నంగా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ పలు ప్రముఖులు పాల్గొన్నారు. తార‌క్ తన భార్య ప్ర‌ణ‌తితో పాటు ఇద్ద‌రు కుమారులు అభ‌య్ రామ్‌, భార్గ‌వ్‌ రామ్‌తో క‌లిసి అంద‌రినీ ఆక‌ర్షించారు.

ఈ వేడుకకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఎన్‌టీఆర్ కుమారులు విక్ట‌రీ వెంక‌శ్‌తో సరదాగా గడుపుతూ కనిపించారు. వెంకీ పిల్లలతో ఆడుకుంటూ, నవ్వుతూ మధురమైన క్షణాలను పంచుకున్నారు.

ఈ వీడియోను చూసి నందమూరి అభిమానులు, వెంకీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో సంతోషంగా గడిపిన క్షణాలు, టాలీవుడ్ ప్ర‌ముఖుల ఉనికి ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *