నిర్వాహణ సమస్యలు, ఎయిర్ క్రాఫ్ట్ ల కొరత కారణంగా ఎయిర్ ఇండియా అమెరికా రూట్‌లలో 60 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నిర్ణయం నవంబర్ 15 నుండి డిసెంబర్ 31 వరకూ ప్రభావం చూపుతుంది. ఎయిర్ ఇండియా తన ప్రకటనలో ఈ రద్దును ప్రకటిస్తూ, ప్రయాణీకులకు సమాచారం అందించినట్లు తెలిపింది. సంస్థ ప్రయాణికులకు సౌకర్యంగా ఇతర సర్వీసులలో సీట్లు అందజేయడంతో పాటు పూర్తి రిఫండ్ అందజేస్తుంది.
రద్దు చేసిన సర్వీసుల్లో ఢిల్లీ – చికాగో మధ్య 14 విమానాలు, ఢిల్లీ – వాషింగ్టన్ రూట్‌లో 28 విమానాలు, ఢిల్లీ – ఎస్ఎఫ్‌వో మధ్య 12 విమానాలు ఉన్నాయి. అలాగే, ముంబై – న్యూయార్క్ రూట్‌లో నాలుగు విమానాలు, ఢిల్లీ – నెవార్క్ రూట్‌లో రెండు విమానాలను రద్దు చేసింది. ఈ రద్దు వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని సంస్థ హామీ ఇచ్చింది.
ప్రయాణికులకు తగిన ఏర్పాట్లతో పాటు పూర్తి రీఫండ్‌ను అందించే ప్రక్రియ చేపట్టామని ఎయిర్ ఇండియా ప్రకటించింది.