విశాఖ జిల్లా సౌత్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టినారు. దీనిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పదవి ఉన్నంతవరకు ఏ రోజు కూడా మీడియా సమావేశాలు పెట్టలేదు. ఇప్పుడు పదవి పోయిన తర్వాత ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రతిపక్షం అంటే డి అంటే డి అనేటట్టు ఉండాలి అని, రెడ్ బుక్ సాంప్రదాయం వచ్చిందని, మితిమీరిన అధికారులు దుర్వినియోగం, ఇలా చాలా మాట్లాడారు. ఇలాంటివన్నీ వైయస్సార్ ప్రభుత్వంలో జరిగినవి ఇప్పుడు కాదు అని వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్పినారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మీరు పార్టీలో ఉన్న నాయకులకి కార్యకర్తలు కాకుండా డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చేవారు. నిన్ను నమ్ముకున్న వారంతా నట్టేట మునిగిపోయారు. వారందరినీ మోసం చేసావ్ ప్రజలు ఎలాగూ నమ్మరు. నాయకులూ కూడా నమ్మరు. సచివాలయాలకు ప్రైవేట్ భవనాలు తీసుకోవడంలో అవినీతి జరిగిందా. అన్న ప్రశ్నకు నేను ఇంకా స్టడీ చేయలేదు కానీ లిక్కర్ షాపులకు తీసుకున్న దానిలో అవినీతి జరిగింది. ఈ విషయంలో లోతుగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వివరిస్తామని చెప్పినారు.
వైయస్ జగన్ పర్యవేక్షణపై వంశీకృష్ణ శ్రీనివాస్ వ్యాఖ్యలు
