గత ప్రభుత్వం మాదిరిగా నా రైతు సోదరులను తాలు, తప్ప, పేరిట ఒక్క గింజ కట్ చేసిన వదిలిపెట్టేది లేదు , ఇది ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో ప్రజా పాలన కొనసాగుతున్న తరుణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన నా దృష్టికి తీసుకురావాలి.
MLA మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గత సీజన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎలాంటి తరుగు లేకుండా వడ్లు కొనుగోలు చేయడం జరిగిందని , అదే మాదిరిగా ఈ సీజన్ లో కూడా ఎలాంటి కటింగ్ లేకుండా రైతల వద్ద నుండి వడ్లు కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
సన్న రకం వడ్లు పండించిన రైతులకు సంతోషించదగ్గ సందర్భంగా ఈ పంట కాలం చరిత్రలో మిగిలిపోనుంది అని సన్నలు పండించిన రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. సన్నలు పండించిన రైతుకు ఎకరానికి సుమారుగా 10- 15 వేల రూపాయల బోనస్ ఈ ప్రభుత్వం ఇవ్వనుందని పేర్కొన్నారు. మన ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ఉప- ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గార్ల సహకారంతో బండల వాగు ప్రాజెక్టును అతి త్వరలో పూర్తి చేస్తాం. శాసన సభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే..! రైతు ప్రభుత్వం..!!
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం… అర్హులైన ప్రతి రైతు కు 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి దానికి కట్టుబడి రైతులకు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దిర్యాల, కుక్కలాగుడుర్ గ్రామాల్లో PPC కేంద్రలను సింగిల్ విండో వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్నీ ప్రారంభించిన శాసన సభ్యులు మక్కన్ సింగ్ ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని ఆరుగాలం కష్టపడి తన రెక్కల కష్టంతో ఎందరో ఆకలి తీర్చే అన్నదాతకు అన్యాయం జరవద్దని అన్నారు. రైతును కష్టపెట్టిన ఎ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడలేదని గత పాలకుల చేతిలో రైతన్నలు చాలా నష్టపోయారని తెలిపారు. గతంలో మాదిరిగా రైతన్నలను ఇబ్బందులకు గురిచేస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రైతులు పండించిన పంట విషయంలో ఎలాంటి కోతలు విదించకూడదని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారు ఆదేశించారు. ఒకవేళ ధాన్యం కోతలు చేస్తున్నారని మా దృష్టికి వస్తే 24 గంటలకు గడవకముందే వారి బాధ్యతల నుండి తొలగించి నూతనంగా ఇతరులను చేర్చడం జరుతుందని హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరి మాటా వినబోమని స్పష్టం చేశారు. రైతులు తమకు ఎలాంటి ఇబ్బందులూ వచ్చిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఈ సీజన్ నుండే సన్న రకం పంటకు రూ. 500 బోనస్ అందించడం జరుగుతుందని అన్నారు. రైతు తన ధాన్యం అమ్మకం జరిపిన వెంటనే రెండు లేదా మూడు రోజుల్లోనే తమ పంట డబ్బులను రైతు ఖాతాలలోని జమ చేయడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం నిర్వహులు, తాజా మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.