ఉన్నత విద్యనభ్యసించడానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ పేద విద్యార్థినికి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అండగా నిలిచారు. ఆర్ధిక సాయం అందజేసి మరో సారి తన మంచి మనసును చాటుకున్నారు. ధర్మసాగర్ మండలం దేవునూరుకు చెందిన పొడిశెట్టి ప్రతాప్ కుమార్తె పల్లవికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. అయితే కాలేజీ ఫీజు కట్టలేక ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్న విషయం తెలుసుకుని వెంటనే స్పందించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య సదరు విద్యార్థినిని హనుమకొండ లోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని కాలేజీ ఫీజు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ బాగా చదువుకొని తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, పేదలకు వైద్యం చేయాలని విద్యార్థికి ఎంపీ సూచించారు. విద్యార్థినికి ఆర్ధిక సాయం చేసిన ఎంపీ కుటుంబ సభ్యలు, నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు.
పేద విద్యార్థినికి అండగా నిలిచిన ఎంపీ డాక్టర్ కావ్య
