పోలీస్ అమరవీరుల సంస్మరణకు సైకిల్ ర్యాలీ

A cycle rally was held in Warangal to commemorate Police Martyrs, led by Police Commissioner Amber Kishore. A cycle rally was held in Warangal to commemorate Police Martyrs, led by Police Commissioner Amber Kishore.

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకోని నిర్వహించిన సైకిల్‌ ర్యాలీలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝాతో పాటు, యువత, చిన్నారులు, వృద్దులు,పోలీసులు ఉత్సహంగా పాల్గోన్నారు. ఏ.జే పెడల్స్‌, ట్రై సిటి సైకిల్‌ రైడర్స్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ముఖ్య అతిధిగా పాల్గోనగా, సెంట్రల్‌ జోన్‌ డిసిపి షేక్‌ సలీమా పచ్చా జెండా ఉపి ఈ సైకిల్‌ ర్యాలీని ప్రారంభించారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయము నుండి హనుమకొండ చౌరస్తా, యం.జి.యం, మట్టేవాడ పోలీస్‌ పోలీస్‌ స్టేషన్‌ తిరిగి ఇదే మార్గం నుండి బాల సముద్రం ,నక్కలగుట్ట మీదగా పొలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయమునకు చేరుకున్నారు. ఈ ర్యాలీ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సైకిలింగ్‌ రైడర్స్‌తో కల్సి పోలీస్‌ అమర వీరులకు జోహర్లు నినాదాలు చేస్తు రైడర్స్‌ ను ఉత్సహపర్చారు. అనంతరం ఈ సైకిల్‌ ర్యాలీ పాల్గోన్న సైకిల్‌ రైడర్లకు పోలీస్‌ అధికారుల చేతుల మీదుగా సర్టిఫికేట్లను ప్రధానం చేసారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతి రోజు సైకిలింగ్‌ చేయడం ద్వారా మరింత ఆరోగ్యంగా వుండటంతో పాటు, రోజంతా ఉత్సహంగా తమ విధుల్లో రాణించవచ్చని, ప్రతి ఒక్కరు సైకిలింగ్‌ కోసం కొద్ది సమయాన్ని కేటాయించడం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరం కావవ్చని, అలాగే పోలీస్‌ అమరవీరులను స్మరిస్తూ నిర్వహించిన ఈ ర్యాలీలో పాల్గోన్న ప్రతి ఒక్కరికి పోలీస్‌ అమరవీరుల కుటుంబాలతో పాటు, పోలీసుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ర్యాలీలో అదనపు డిసిపి రవి, ఏసిపిలు జితేందర్‌ రెడ్డి, అనంతయ్య, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌.ఐలు, ఏ.జే పెడల్స్‌ యాజమాన్యం, ట్రైసిటి సైకిల్‌ రైడర్స్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, నిట్‌ కళాశాల విద్యార్థులతో పాటు ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *