మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన చాకలి నాగరాజు (38) అనే యువకుడు గురువారం రోజు ఉదయం తన వ్యవసాయ పొలం బోరు వద్దకు వెళ్లిన రైతు విద్యుత్ తీగ తెగిపోవడంతో స్టాటర్ సరి చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు రామాయంపేట ఎస్సై బాలరాజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రామాయంపేటలో విద్యుత్ షాక్‌తో యువ రైతు దుర్మరణం
