విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గ 39వ వార్డుకు చెందిన కదిరి అప్పారావు కుటుంబానికి రూ. 5000 ఆర్థిక సాయం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అందించారు. బుధవారం ఉదయం ఆశీలమెట్ట కార్యాలయంలో సొంత నిధులతో రూ. 5000 ఆర్థిక సాయం అందించడం జరిగింది. కదిరి అప్పారావు తల్లి కదిరి కళ్యాణి ఇటీవల మరణించడంతో, ఆమె వర్ధంతి ఖర్చులకు ఈ సాయం ఇచ్చారు. వాసుపల్లి గణేష్ కుమార్, దక్షిణ నియోజకవర్గ ప్రజలతో తనది విడదీయరాని బంధమని చెప్పారు. ప్రజల కష్టాలను తనవిగా భావించి, తన వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందించినట్లు తెలిపారు. అధికారంలో లేకపోయినా, ప్రజల నుండి తనను వేరుచేయలేరని స్పష్టం చేశారు. దక్షిణ ప్రజల ఆదరణకు ఎప్పుడూ రుణపడే ఉంటానని, ప్రజలకు సేవ చేయడమే తనకు సంతృప్తి ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కదిరి కళ్యాణి బంధువులు, వైసిపి నాయకులు చింతకాయల వాసు, ఆకుల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
కదిరి అప్పారావుకు ఆర్థిక సాయం అందించిన వాసుపల్లి గణేష్
